వేల కోట్ల రూపాయల నష్టానికి కారణమయిన వాణిజ్యపన్నుల శాఖ!
నేను ఈ సంవత్సరం జనవరి నుండి ప్రభుత్వానికి అనేక కంప్లైంట్స్ ఇచ్చాను. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాణిజ్య పన్నుల శాఖలో TG VAT 2005 చట్టంలోని అత్యంత ముఖ్యమైన సెక్తిఒన్లు 2 (4), 2(24), 17, 21 మరియు 43 లను చట్ట విరుద్ధముగా ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలుగ చేసారు. a వివరాలను కింద వివరిస్తాను.
చట్టాలు, ప్రభుత్వం పట్ల అవిధేయత మరియు చట్టాల ఉల్లంఘనలతో
వేల కోట్ల రూపాయల నష్టానికి కారణమయిన వాణిజ్యపన్నుల శాఖ!
Ø భారత రాజ్యాంగము ఆర్టికల్ 196 ప్రకారం రాష్ట్రాలకు కొన్ని చట్టా లు చేయుటకు అధికారమివ్వబడింది.
Ø రాష్ట్రాలకు అధికారమున్న అంశాలపై శాసన మండలి ( శాసన సభ మరియు శాసన పరిషత్తు )చేత ఆమోదింప బడి, గవర్నరు గారి ఆమోదం పొందిన పిదప బిల్లులు చట్టాలుగా మారతాయి.
Ø అటువంటి చట్టాలను ఉల్లంఘించినా లేదా అవిధేయత ప్రదర్శించనా అది రాజ్యాంగాన్ని అగౌరవ పరచడమే..
Ø పై విధంగా అమల్లోకి వచ్చిందే "విలువ ఆధారిత చట్టం 2005, లేదా వ్యాట్ చట్టం 2005, మరియు వ్యాట్ రూల్స్2005.
Ø ఈ చట్టం ప్రకారం మన రాష్ట్రము అనేక వస్తువులపై పన్నులను విధిస్తుంది. ఈ పన్నును అంతిమ కొనుగోలు దార్లుగా/వినిమయ దార్లుగా ప్రజలందరు చెల్లిస్తారు.
Ø ప్రతి ఉదయం వాడె టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ మొదలుకొని దినమంతా వాడే అనేక వస్తువుల పైన ప్రజలంతా వ్యాట్ పన్ను చెల్లిస్తారు.
Ø మనం పొందే సేవలలో అనేక రకాల వస్తువుల వినియోగం జరుగుతుంటుంది. అటువంటి వస్తువులన్నింటికి వ్యాట్ పన్నును అంతిమంగా వినియోగదారులమైన మనమే చెల్లిస్తాము.
Ø ఉదాహరణకు అర్. టి. సీ. బస్సుల్లో ప్రయనించే ప్రయానికులు బస్సుల కొనుగోలుపై మరియు బస్సుల విడి భాగాలపై చెల్లించే వ్యాట్ టాక్స్ ను అంతిమంగా ప్రయనికులే ప్రయాణ చార్గిగ భరి స్తారు.
Ø ఆ విధంగా నేరుగా వస్తువులను వినియోగించినా లేదా మనం పొందే సేవల్లో వినియోగించే వస్తువుల పైన కూడా ఈ వ్యాట్ పన్నును అంతిమంగా ప్రజలే చెల్లిస్తారు.
Ø కానీ,మనం చెల్లించే ఈ పన్ను ఆదాయం పన్నులాగా సరాసరి ప్రభుత్వానికి చెల్లించము. మనం వస్తువులు కొనే సమయంలో వాటి ధరలో ఇమిడి ఉండే విలువ ఆధారిత పన్నును వ్యాపారులకు చెల్లిస్తాము. ఈ విధంగా మనం చెల్లించిన పన్నును వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లిస్తారు.
Ø ఇతర రాష్ట్రాలనుండి కొనుగోలు చేసిన వ్యాపారి కానీ, లేదా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి దారుడు కానీ అమ్మే వస్తువుల పైన కొనుగోలు చేసే వ్యాపారి నుండి వస్తువు ధరతో పాటు వ్యాట్ పన్నును వసూలు చేసి ఆ పన్నును ప్రభుత్వానికి చెల్లించాలి.
ఉదా: X అనే వ్యాపారి Rs. 1,00,000 ల సరుకును B అనే వ్యాపారికి 5% పన్నుతో అమ్మితే B కొన్న వెల Rs. 1,00,000 మరియు పన్ను Rs. 5000 ఔతుంది. తిరిగి తాను 20% లాభంతో మరో వ్యాపారి C కి Rs. 1,20,000 అసలు ధర మరియు Rs. 6000 పన్నును వసూలు చేస్తాడు. మరియు B తాను C నుండి వసూలు చేసిన Rs. 6000 పన్నులో నుండి తను అంతకు ముందు X అనే వ్యాపారికి చెల్లించిన Rs. 5000 పన్నునుమినహాయించుకుని కేవలం Rs 1000 లను ప్రభుత్వానికి చేల్లిస్తాడు. ఈ విధంగా B తను X కు చెల్లించిన Rs. 5000 పన్నును B యొక్క ఇన్ పుట్ టాక్స్ కెృడిట్ అంటారు. తను అమ్మేటప్పుడు వసులు చేసే Rs. 6000 పన్నుమొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనిలేదు. ఎందుకంటే అందులోనుండి Rs. 5000 పన్నును X అనే వ్యాపారికి కొనుగోలు సమయంలో చెల్లించాడు. X అనే వ్యాపారి అప్పటికే Rs. 5000 పన్నును ప్రభుత్వానికి చెల్లించాడు/చెల్లిస్తాడు.
B నుండి కొనుగోలు చేసిన మరో వ్యాపారి C మాత్రం Rs. 6000 పన్నుమొత్తాన్ని B కి చేల్లిస్తాడు. ఇప్పుడు B ఆ సరుకుకు చెల్లించిన మొత్తాలు ఈ విధంగా ఉన్నాయి.
C కొనుగోలు చేసిన ధర Rs. 1,20,000
చెల్లించిన పన్ను Rs. 6000
ఇప్పుడు C ఈ మొత్తాన్ని చిల్లర వినియోగ దారులకు పన్ను కాకుండా Rs. 1,50,000 లకు అమ్మడను కుంటే దాని పైన 5% చొప్పున Rs. 7500 ల పన్ను ఔతుంది. ఇప్పుడు C Rs. 6000 ఇన్ పుట్ టాక్స్ కెృడిట్ పోను మిగిలిన Rs. 1500 లు పన్నుగా ప్రభుత్వానికి చెల్లించాలి.
ఇప్పుడు B యొక్క లాభం Rs. 20,000
C యొక్క లాభం Rs. 30,000
ప్రభుత్వానికి వచ్చిన మొత్తం పన్ను :
X అనే వ్యాపారి చెల్లించినది --- Rs. 5000
B అనే వ్యాపారి చెల్లించినది --- Rs 1000
C అనే వ్యాపారి చెల్లించినది --- Rs. 1500
మొత్తం వసూలైన పన్ను ------ Rs. 7500
5% పన్ను విధిస్తే నిజానికి అది 7.5% వరకు అయ్యే అవకాశ మెలా ఉంటుందో చూసాము.
ఒక వేల పన్ను శాతం 14.5% అయితే పై పన్నులు ఈ విధంగా ఉంటాయి:
ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్ను :
X అనే వ్యాపారి చెల్లించినది --- Rs. 14500
B అనే వ్యాపారి చెల్లించినది --- Rs 2900
C అనే వ్యాపారి చెల్లించినది --- Rs. 4350
మొత్తం వసూలైన పన్ను ------ Rs. 21,750
ఈ విధంగా పన్ను 14.5% అయితే ఆ పన్ను నిజానికి21.75% అయ్యే అవకాశముంటుంది.
Ø పైన తెలిపిన విధంగా వ్యాట్ పన్ను ప్రతి వ్యాపారి తను అమ్మకాలు జరిపే సమయంలో వసూలు చేస్తాడు. అలా వసూలు చేసిన పన్నులోనుండి తాను కొనే సమయంలో చెల్లించిన పన్నును (ఇన్ పుట్ టాక్స్ కెృడిట్)మినహాయించుకొని మిగిలిన పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తాడు.
Ø వ్యాపారులు ఈ విధంగా వసూలు చేసిన పన్నును ప్రభుత్వ ఖజానాకు జమ చేయడానికి తెలంగాణ వ్యాట్ చట్టం ద్వారా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేయ బడింది. అంటే ఏ చట్టం ద్వారా నైతే ప్రభుత్వం ప్రజల పైన విలువ ఆధారిత పన్నును విధించిందో అదే చట్టం అమలుకు వాణిజ్య పన్నుల శాఖను ఏర్పరచింది.
Ø ఇదే విషయాన్ని మరో రకంగా చెప్పాలంటే ప్రజలు చెల్లించిన పన్ను ప్రభుత్వ ఆస్తి. ఈ ఆస్థిని రక్షించే బాధ్యత. అంటే ఆ పన్నును వ్యాపారాలు ప్రభుత్వ ఖజానాకు సక్రమంగా చెల్లించే బాధ్యత వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించ బడింది.
Ø ఓకవేళ అధికారులు దురుద్దేశ్య పూర్వకంగా, చట్టాన్ని ఉల్లంఘించి పన్ను వసులును అడ్డుకుంటే అది నేర పూరిత విశ్వాస ఘాతుక(Criminal breach of Trust) మౌతుంది. ఇది భారత శిక్షా స్మృతి లోని సెక్షన్ 409ప్రకారము శిక్షార్హము.
Ø వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు రెండు రకాలుగా ఉంటారు.
Ø పర్యవేక్షక అధికారులు: వాణిజ్య పన్నుల కమీషనర్, వాణిజ్య పన్నుల అదనపు కమీషనర్, వాణిజ్య పన్నుల జాయింట్ కమీషనర్, వాణిజ్య పన్నుల ఉప కమీషనర్. వాణిజ్య పన్నుల చట్టంలో కమీషనర్ అని ఉన్న చోట ఈ పర్యవేక్షక అధికారు లెవరైనా కావచ్చు.
Ø క్షేత్రస్థాయి అధికారులు: సహాయ వాణిజ్య పన్నుల కమీషనర్, వాణిజ్య పన్నుల అధికారి, వాణిజ్య పన్నుల ఉప అధికారి మరియు వాణిజ్య పన్నుల సహాయ అధికారి. వ్యాట్ చట్టానికి లోబడి పర్యవేక్షక అధికారులు ఎప్పటికప్పుడు వ్యాట్ చట్టం లోని సెక్షన్ 77 ప్రకారం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశా లిస్తుంటారు. ఈ ఆదేశాలను వారు విధిగా పాటించాలి.
Ø చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏవైనా అదేశా లిస్తే అందుకు బాధ్యులు పర్యవేక్షక అధికారులే! పర్యవేక్షక అధికారుల అటువంటి చట్ట విరుద్ధ ఆదేశాలను పాటిస్తే క్షేత్రస్థాయి అధికారులు బాధ్యులు కారు. వ్యాట్ చట్టం లోని సెక్షన్ 77 ప్రకారం ఏ రకమైన ఆదేశాలనైనా పాటించడం క్షేత్రస్థాయి అధికారుల బాధ్యత.
Ø తెలంగాణ వ్యాట్ చట్టం సెక్షన్ 20 ప్రకారం ప్రతి వ్యాపారి తన కొనుగోళ్ళు మరియు అమ్మకాల వివరాలతో పాటు చెల్లించాల్సిన పన్ను విలువను తెలుపుతూ ప్రతినెలా వాణిజ్య పన్నుల శాఖకు ఆన్ లైన్ లో రిటర్నులు సమర్పించి ఆ పన్నును బ్యాంక్ లో చెల్లించాలి. ఆ రిటర్నుల్లో ఏవైనా అంక గణిత తప్పులుంటే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సరిచేస్తారు. 4 సంవత్సరాల కాలంలో ఆ రిటర్నులు మదింపు చేయబడకుంటే వాటిని యధా తధంగా అంగీకరించినట్టే భావించబడుతుంది.
Ø తెలంగాణ వ్యాట్ చట్టం సెక్షన్ 21 ప్రకారం ప్రతి వ్యాపారి ప్రతినెలా వాణిజ్య పన్నుల శాఖకు ఆన్ లైన్ లో సమర్పించిన స్వీయ మదింపు చేసిన రిటర్నులలో ఏవైనా లోపాలున్నట్టు గమనిస్తే శాఖ అధికారులచే నాలుగు సంవత్సరాలలోపు వాస్తవంగా వ్యాపారి చెల్లించాల్సిన పన్నును మదింపు చేసి పన్నుతో పాటు,, అపరాధరుసుము మరియు వడ్డీని వసులు చేయాలి.
Ø . నాలుగు సంవత్సరాలు దాటితే ఎవరైనా వ్యాపారి తను చేల్లించా ల్సిందానికన్నా ఎంత తక్కువ చెల్లించినా ఆ చెల్లించాల్సిన ఆసలైన పన్ను ప్రభుత్వ ఖజానాకు రాదు. కానీ, ప్రజలు మాత్రం ఆ పన్నును ఆ వ్యాపారికి అప్పటికే చెల్లించి ఉంటారు. అంటే ప్రభుత్వ ఆస్థికి నష్టం వాటిల్లిం ది.
Ø అందుకే ప్రజలు చెల్లించిన ఈ ప్రభుత్వ ఆస్థికి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో వ్యాట్ చట్టంలోని సెక్షన్ 2 లోని 4 వ ఉప సెక్షన్ ప్రకారం రెండు రకాల అధికారులు పన్ను మదింపు చేయాలనీ ఆదేశించ బడింది. అందులో ఒకరు వాణిజ్య పన్నుల కమీషనర్ చేత ఆదేశించ బడినవారు. మరియు రెండవ వారు వ్యాట్ రూల్స్ చేత అధికారమివ్వ బడినవారు.
Ø వ్యాట్ రూల్స్ లోని 59 వ రూల్ ప్రకారం ( 2013 జనవరి నుండి) LTU సర్కిళ్లలో మదింపు చేసే అధికారం సహాయ కమిషనర్ కు మరియు సర్కిళ్లలో మదింపు చేసే అధికారం వాణిజ్య పన్నుల అధికారికి ఇవ్వబడింది.
Ø వారితోపాటు ఆ డివిజన్ లోని వాణిజ్య పన్నుల ఉప కమీషనర్ గారిచే ఆథఠైజ్ చేయబడిన వాణిజ్య పన్నుల ఉప అధికారి స్థాయికి తక్కువ కానీ అధికారులు కూడా ఆ డివిజన్ లోని ఏ సర్కిల్ లోని వ్యాపారి అకౌంట్ల నైనా మదింపు చేయ వచ్చును.
Ø తెలంగాణ రాష్ట్రమేర్పడిన రెండవ తేదీ జూన్ 2014 నుండి గత మూడు సంవత్సరాల్లో డీసీల చేత అంటే వాణిజ్య పన్నుల ఉప కమీషనర్ గారిచే ఆథఠైజ్ చేయబడిన అధికారులు పన్ను మదింపు చేసిన వ్యాపార సంస్థల సంఖ్య దాదాపు 30,000 (ముప్పై వేల) నుండి 32,000 (ముప్పై రెండు వేల ) వరకు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా 1,82,000 వ్యాపారులుంటే అందులో కేవలం 30,000 (ముప్పై వేల) నుండి 32,000 (ముప్పై రెండు వేల ) వరకు పన్ను మదింపు జరిగింది.
Ø మిగిలిన 1,50,000 వ్యాపారుల దగ్గరికి వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఏ అధికారి కూడా పోలేదు. వాళ్ళు ఏం చేసారో, చేల్లించాల్సిన పన్నులో ఎంతచేల్లించారో , ఎంత చెల్లించలేదొ ఆ దేవుడికే తెలియాలి.
Ø ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే వ్యాట్ రూల్స్ లోని 59 వ రూల్ ప్రకారం అధికారమివ్వబడిన LTU సర్కిళ్లలో మదింపు చేసే అధికారమున్న సహాయ కమిషనర్ లు మరియు సర్కిళ్లలో మదింపు చేసే అధికారమున్న వాణిజ్య పన్నుల అధికారులు ఎవ్వరిని కూడా వాణిజ్య పన్నుల ఉప కమీషనర్లు ఆ మిగిలిన 1,50,000 వ్యాపారుల దగ్గరికి పోనివ్వలేదు.
Ø ఆ విధంగా ఈ 1,50,000 ల మంది వ్యాపారులకు లాభం చేకూరుస్తూ తెలంగాణ ప్రభుత్వానికీ మరియు రాష్ట్ర ప్రజలకు తీవ్రమయిన నష్టాన్ని కలుగ చేసారు. అందుకనుగుణంగా తగిన సర్క్యులర్లను విడుదల చేసారు.
Ø ఏ వ్యాపార సంస్థ కైనా వాణిజ్య పన్నుల అధికారులు ఎవ్వరైనా వెళ్ళాలంటే వ్యాపార సంస్థకు ముందుగా వ్యాట్ 304 అనే ఒక ఫారం ను పంపస్తారు. ఈ ఫారం చట్ట విరుద్ధమయినది. ఎందుకంటే వ్యాట్ చట్టం లోని సెక్షన్ 43 కు ఇది పూర్తిగా ఉల్లంఘన
Ø ఆ తర్వాత పోవాల్సిన అధికారికి ADM IB అనే మరో ఫారం ను ఇస్తారు. ఏ వ్యాపార సంస్థకైతే సదరు అధికారి వెల్లాలో ఆ సంస్థకు ఈ ADM IB అనే ఫారం ను చూపించాలి.
Ø సదరు వ్యాపారి వారం లేదా పదిరోజుల సమయాన్ని అడిగితే అంత సమయం తర్వాత వెళ్ళాలి.
Ø ఈ విధమయిన పద్ధతిలో పైన తెలిపిన 30,000 (ముప్పై వేల) నుండి 32,000 (ముప్పై రెండు వేల ) మదింపుల్లో 25000 ల వరుకు అలా జరిపినవే. మిగిలినవి మాత్రం ఆకస్మికంగా జరిపినవే.
Ø వ్యాట్ 304 అనే ఫారం వ్యాట్ చట్టం లోని సెక్షన్ 43 కు పూర్తిగా ఉల్లంఘన మాత్రమే. ఈ వ్యాట్ 304 అనే ఫారంతో జరిపిన పైన తెలిపిన 25000 ల మదింపులన్నీ చట్ట విరుద్ధమయినవే. వీటి ద్వారా వాణిజ్య పన్నుల కమీషనర్, వాణిజ్య పన్నుల అదనపు కమీషనర్, వాణిజ్య పన్నుల జాయింట్ కమీషనర్ మరియు వాణిజ్య పన్నుల ఉప కమీషనర్ ఆ 25000 ల వ్యాపారులను కూడా పన్ను ఎగవేతకు పూర్తిగా సహకరించారు.
పన్ను మదింపు (అసెస్మెంట్) గురించి:తెలంగాణ వ్యాట్ చట్టం సెక్షన్ 20 ప్రకారం వ్యాపారులు తము స్వీయ మదింపు చేసి సమర్పించిన రిటర్నులన్నీపూర్తిగా విశ్వసనియం కావు. చాల వ్యాపార సంస్థలు తము చెల్లించాల్సిన పన్ను కంటే తక్కువ పన్నును మాత్రమే చెల్లించడానికి ప్రయత్నిస్తాయి. అంటే వ్యాపారుల్లో చాల మంది వీలు దొరికితే పన్ను ఎగవేతకు పాల్పడుతుంటారు. అటువంటి పన్ను ఎగవేతను అరికట్టడానికి తెలంగాణ వ్యాట్ చట్టం సెక్షన్ 21 ప్రకారం శాఖ అధికారులు చేపట్టే పన్ను మదింపు లేదా అసెస్మెంట్. అధికారులు చేపట్టే మదిం పు లో వ్యాపారులు తాము చెల్లించాల్సిన పన్నుకంటే తక్కువ చెల్లించినట్టు తేలితే అధికారులు వారినుండి చెల్లించాల్సిన పన్నుతో పాటు అపరాధ రుసుమును కూడా వాసులు చేస్తారు. ఇది తప్పు చేసినందుకు గాను వ్యాపారికి చట్టం విధించే శిక్ష.
వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎన్ని ఎక్కువ వ్యాపార సంస్థల పన్ను మదింపు చేస్తే అంత మంచిది. అపరాధ రుసుము మరియు పన్ను పైన వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే భయంతో వారు తము సమర్పించే రిటర్నుల్లోనే సరైన పన్నును చెల్లిస్తారు.
అందుకు భిన్నంగా అధికారులు ఏవో కొన్ని తక్కువ సంస్థల్లోనే పన్ను మదింపు జరిపితే వ్యాపారుల్లో భయం సన్నగిల్లి పన్ను ఎగవేత ఎక్కువ ఔతుంది.
అందుకే ప్రజలు చెల్లించిన ఈ ప్రభుత్వ ఆస్థికి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో వ్యాట్ చట్టంలోని సెక్షన్ 2 లోని 4 వ ఉప సెక్షన్ ప్రకారం రెండు రకాల అధికారులు పన్ను మదింపు చేయాలనీ ఆదేశించ బడింది. అందులో
1) ఒకరు వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ చేత ఆదేశించ బడినవారు. మరియు
2)రెండవ వారు వ్యాట్ రూల్స్ లోని 59 వ రూల్ చేత అధికారమివ్వ బడినవారు.
కాని,అజమాయిషీ అధికారులైన
Ø ఉప కమీషనర్ మొదలుకొని కమీషనర్ వరకు కలసి కట్టుగా చట్టంలోని సెక్షన్ 2(4) ప్రకారము ఆదేశించ బడిన (రూల్స్ చేత) అధికారులచే కనీసం ఒక్కటంటే ఒక్క మదింపు కూడా చేయకుండా ఆపారు..
ఆకస్మిక తనిఖీల గురించి(సెక్షన్ 43):తెలంగాణ వ్యాట్ చట్టం 2005 లోని సెక్షన్ 43 ప్రకారము వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ చేత ఆదేశించ బడినవారు మరియు వ్యాట్ రూల్స్ లోని 59 వ రూల్ చేత అధికారమివ్వ బడినవారు ప్రతి వ్యాపారి యొక్క వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టాలని అదేశించ బడింది. కానీ, ఉప కమీషనర్ మొదలుకొని కమీషనర్ వరకు కలసి కట్టుగా చట్టంలోనిసేక్షన్ 2(4) ప్రకారము ఆదేశించ బడిన (రూల్స్ చేత) అధికారులచే సెక్షన్ 43 ప్రకారం చేయాల్సిన ఆకస్మిక తనిఖీలను కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయనివ్వలేదు.
వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ చేత అదేశించ బడిన అధికారులతో మాత్రం సంవత్సరానికి కేవలం 2 వేలు మరియు ఆ పైన మరికొన్ని వరకు తనిఖీలను చేయించారు.
ఈ విధంగా అజమాయిషి అధికారులందరు కలిసి కట్టుగా వ్యాట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ , చట్టం పట్ల అవిదేయతతో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులతో కూడిన ప్రభుత్వ ఆస్తికి ఉద్దేశ పూర్వకంగా నష్టాన్ని చేకూర్చారు.
Comments
Post a Comment